ముస్తాబాద్, నవంబర్ 8 మండల కేంద్రంలోని శివకేశవ ఆలయాల చైర్మన్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల సహకారంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, స్వామివారి ఉత్సవ విగ్రహాలను చక్రాలు లేని రెండు పల్లకీలపై అందంగా అలంకరించారు. అనంతరం భక్తులు ఆ
పల్లకీలను భుజాలపై మోస్తూ మంగళ వాయిద్యాలు, భజనల నడుమ పట్టణ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. నాలుగు వైపులా నలుగురు చొప్పున భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పల్లకీలను మోయడం విశేషంగా నిలిచింది. స్వామివారి దర్శనం కోసం పురవీధుల్లో భక్తులు బారులు తీరారు. భక్తుల జయజయధ్వానాలతో ముస్తాబాద్ పట్టణం మార్మోగింది. స్వామివారి ఆశీస్సులతో మండల ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, మండలం సస్యశ్యామలంగా ఉండాలని చైర్మన్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి భక్తులందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏళ్ల బాల్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు సంతోష్ రావు, మాజీ కమిటీ చైర్మన్ సేరయ్య, రాజేశం, తాళ్ల రాజు, గూడూరు భరత్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
33 Views ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి: మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని శుక్రవారం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నారాయణపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.మండలానికి మొదటి దశలో 640 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు వాటిలో ఇప్పటికే 332 […]
302 Viewsరైతుబంధుకు రైతులు దరఖాస్తు చేసుకోవాలి వ్యవసాయ విస్తరణ అధికారి సామాజత డిసెంబర్ 14 సిద్దిపేట జిల్లా చేర్యాల కడవేరుగు క్లస్టర్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి, కడవేరుగు గ్రామాల రైతులు రైతుబంధు కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఏఈఓ సమాజాత తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కడవేరుగు, పోతిరెడ్డిపల్లి గ్రామాల రైతులు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కడవెరుగులోని రైతు వేదిక వద్ద రైతుబంధు ఫారం నింపి ఆధార్ కార్డు జిరాక్స్, […]
136 Viewsసిద్దిపేట జిల్లా రాయపొల్ మండలం బేగంపేట్ గ్రామంలో ఆదివారం రోజు రాయపొల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతుగారి రవీందర్ రెడ్డి బేగంపేట గ్రామంలో గత వారం రోజుల క్రితం కొప్పు సత్యనారాయణ, కొప్పు రామవ్వ తల్లి కొడుకు గుండెపోటు చనిపోయారని తెలుసుకొని ఆదివారం రోజు వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం, 1,000/- రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అట్లా లక్ష్మారెడ్డి, మంకిడి నాగరాజు, […]