గోదావరి పుష్కర ఘాట్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పర్యవేక్షణ.
తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా:
లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి నది వద్ద రానున్న పుష్కరాల సందర్భంగా చేపట్టనున్న పుష్కర ఘాట్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఏర్పాట్ల పురోగతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కర ఘాట్ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, తాగునీరు తదితర సౌకర్యాల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు.పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్, చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి- వెంకటస్వామి గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు చల్లా నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి , లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





