ప్రాంతీయం

దివ్యాంగుల సాధికారత కృషికి రాష్ట్ర స్థాయి పురస్కారాల కొరకు దరఖాస్తుల స్వీకరణ – జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్

9 Views

దివ్యాంగుల సాధికారత కృషికి రాష్ట్ర స్థాయి పురస్కారాల కొరకు దరఖాస్తుల స్వీకరణ – జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్

తెలుగు న్యూస్ మంచిర్యాల:
దివ్యాంగుల అభ్యున్నతి, సాధికారతకు విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ప్రభుత్వం అందించే రాష్ట్ర స్థాయి పురస్కారాల కొరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని, ఈ సందర్భంగా దివ్యాంగుల అభ్యున్నతి, సాధికారత కోసం విశేష కృషి చేసిన ఉత్తమ వ్యక్తులు స్వచ్ఛంద సంస్థలకు రాష్ట్ర స్థాయి పురస్కారాలను ప్రధానం చేసి సత్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు, సేవకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు విధానం, నమూనా, పురస్కారాలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాల కొరకు అధికారిక వెబ్‌సైట్ https://depwdsctgp.telangana.gov.in లో సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలోని అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్దేశిత నమూనాలో అవసరమైన ధృవీకరణ పత్రాలను జతచేసి ఈ నెల 16వ తేదీలోగా జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *