మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం 925 కోట్లు నిధులు మంజూరు.
తెలుగు న్యూస్ మంచిర్యాల:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ 925 కొట్లు రూపాయల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కి నా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అనంతరం నాయకులతో, కార్యకర్తలతో కలిసి ఐబీ చౌరస్తా నుంచి M కన్వెన్షన్ హాల్ వరకు పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ ,అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూదరి తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు,మంచిర్యాల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కో -ఆప్షన్ సభ్యులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





