ప్రాంతీయం

వేలూరు గ్రామంలో తైబజార్ ప్రారంభం – రైతులకు ప్రత్యక్ష విక్రయ వేదిక.

18 Views

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వేలూరు గ్రామంలో తై బజార్ ప్రారంభించబడింది. ఈ తై బజార్ ద్వారా స్థానిక రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించబడింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తప్పెట్ల ఎల్లమ్మ, గ్రామపంచాయతీ అధికారులు మాట్లాడుతూ 2026- 2027 సంవత్సరానికి సంబందించిన మధ్యవర్తులు లేకుండా రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందేందుకు తై బజార్ ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే గ్రామ ప్రజలు తక్కువ ధరలకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చన్నారు. తై బజార్ ద్వారా గ్రామంలో ఆర్థిక చైతన్యం పెరగడమే కాకుండా రైతులకు ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *