రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఖండించారు.
తెలుగు న్యూస్ మంచిర్యాల:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని M కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి కన్నెర్రతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. యాభై ఏళ్ల నుంచి సముద్రంలో భూతాపం పెరిగి ఎలినినో రూపంలో విలయతాండం చేస్తోందనే నిజాలు తెలియని విచిత్ర పరిస్థితిలో విపక్ష నేతలున్నారని విమర్శించారు. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులోకి ఈ మధ్య కురిసిన అకాల వర్షాలతో వరదనీరు చేరిందన్నారు. తాగునీరుకు సరిపడా ఉన్నాయని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో కరవు పరిస్థితులు లేవని తెలిపారు. నీళ్ల కరవు ఉన్నందున రైతులందరూ రెండవ పంటలు వేయవద్దని అలాగే నీటిని వృథా చేయొద్దని కోరారు. కడెం డిస్త్రి బ్యూటరీ కెనాల్ లు పగుళ్లు తేలినందున 42 వ డిస్ట్రిబ్యూటరీ వరకు నీళ్లు రావడం లేదని తెలిపారు. సింగరేణిలో మారుపేర్ల సమస్య తీరిపోనున్నట్లు చెప్పారు. కార్మికుల ఆదాయపు పన్నును యాజమాన్యమే భరిస్తుందన్నారు. డిపెండెంట్ ఎంప్లాయ్ సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు.మంచిర్యాల నియోజకవర్గం గడ్డ కాంగ్రెస్ అడ్డా అని అన్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా నాకు అనూహ్య స్థాయిలో ప్రజల మద్దతు లభించిదని పేర్కొన్నారు. మంచిర్యాల ప్రజల ఋణం తీర్చుకోవడానికి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూదరి తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు,మంచిర్యాల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





