ఎస్ ఐ ఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి.- రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి
తెలుగు న్యూస్ మంచిర్యాల నవంబర్ 2, 2026:
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి ఇతర ఎలక్ట్రోరల్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. నూతన ఓటరు నమోదు, సవరణలు/మార్పులు, తొలగింపుల కొరకు ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సూచించారు. ఓటరు జాబితా నుండి తొలగించిన ప్రతి ఓటరును, తొలగించడానికి గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని, స్వీప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే వ్యాసరచన, రంగోలి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారంలో అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన, రంగోలి పోటీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





