రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో దరఖాస్తు స్వీకరణ చివరి రోజు భారీ ఎత్తున రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పోడు భూముల కోసం గుండారం గ్రామంలో పట్టాల కోసం దున్నుతున్న పోడు భూముల కోసం 210 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూక్య శంకర్ నాయక్ ఉప సర్పంచ్ సిద్ధల బాలయ్య, పోడు భూముల గ్రామ చైర్మన్ బానోతు రాజు నాయక్ ,కార్యదర్శి జజ్జరి నర్సయ్య, గిరిజన నాయకుడు బాపురావు, కార్యదర్శి దేవరాజు తదితరులు పాల్గొన్నారు





