వడ్డెర కాలనీలో అక్రమ బెల్టు షాపులపై మంచిర్యాల పోలీసుల ఆకస్మిక దాడులు
తెలుగు న్యూస్ మంచిర్యాల:
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలనీలో పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఆది మధుసూదన్ మరియు పోలీసు సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను గుర్తించి, వారి వద్ద నుంచి సుమారు రూ.40,000 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మద్యం వివరాలు:
1. ఒల్లెపు కుమార్, తండ్రి: స్వామి, వయస్సు: 42 సంవత్సరాలు, కిరాణా షాపు, వడ్డెర కాలనీ, మంచిర్యాల.
2. యైదా లక్ష్మణ్, తండ్రి: రాజయ్య, వయస్సు: 56 సంవత్సరాలు, కిరాణా షాపు, గౌతమినగర్.
3. ఎడగొట్టు పున్నం, తండ్రి: రాజేష్, వయస్సు: 25 సంవత్సరాలు, వడ్డెర బెల్టు షాపు, వడ్డెర కాలనీ.
4. వల్లెపు సాయి కుమార్, కార్తికేయ కిరాణా & జనరల్ స్టోర్, వడ్డెర కాలనీ, మంచిర్యాల.
నిందితులను స్వాధీనం చేసుకున్న మద్యంతో సహా పోలీస్ స్టేషన్‌కు తరలించి,తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ తెలిపారు.





