ప్రాంతీయం

జోరుగా ప్రచారంచేస్తున్న కాంగ్రెస్ నాయకులు దీటి…

328 Views

ముస్తాబాద్, మే 7 (ప్రభన్యూస్): కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు.. రాష్ట్రాన్ని తెచ్చుకున్న కాంగ్రెస్ కేంద్రంలో కూడా భారీ మెజార్టీతో గెలవాలని ఓటర్లకు తమ అమూల్యమైన ఓటును హస్తంగుర్తుపై వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అదేవిధంగా మనరాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో ఆరుగ్యారెంటీలను ఇదివరకే అమలు చేశారు. మరిన్ని నూతన పథకాలతో ముందుకు రావాలనుకుంటే కాంగ్రెస్ నే గెలిపించుకోవాలని ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీటినర్సింలు పేర్కొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో నడవాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీఅన్నారు. పేదలపార్టీ అంటేనే నాది నీది ఎవరిదో కాదు మనఅందరిపార్టీ రాష్ట్రం ఎలాగో వచ్చింది ఇంకాస్త కష్టపడి కేంద్రంలో ఎంపీ సీట్లుకూడా సాధిస్తే మనంమేది అడిగినా మనకు హక్కు ఉంటది మనబతుకులు మారాలంటే కాంగ్రెస్లో గెలిపించాలి అన్నారు. ఈకార్యక్రమంలో బండి శ్రీకాంత్, వేముల వెంకట్ గౌడ్, ముక్క నరసయ్య, నల్ల బాలెళ్ళు గుట్ట నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found