ప్రాంతీయం

రామగుండం కమిషనరేట్‌లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

5 Views

రామగుండం కమిషనరేట్‌లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

తెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా:

*మానవత్వం, సత్యం,ధర్మం విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీకి : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, పోలీస్ అధికారులు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, ప్రపంచం ఉన్నంతకాలం మహర్షి వాల్మీకి చరిత్ర,ఆయన రచించిన రామాయణం చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.మహర్షి వాల్మీకి రచించిన రామాయణం సత్యం,నీతి,ధర్మం, కర్తవ్యబోధ వంటి విలువలను మానవాళికి అందించిన అమూల్యమైన గ్రంథమని పేర్కొన్నారు.
మహర్షి వాల్మీకి బోధనలు సమాజంలో సత్యం, న్యాయం, ధర్మం, సమానత్వం వంటి విలువలను పెంపొందించేందుకు నేటికీ ప్రేరణగా నిలుస్తున్నాయని తెలిపారు. మానవత్వం, సత్యం,ధర్మం వంటి ఉన్నత విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీకి సమాజానికి ఆదర్శప్రాయులని అన్నారు.
మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన రచనలు మానవ జీవితంలో నైతిక విలువలు, కర్తవ్యనిష్ఠ, ధర్మబద్ధమైన జీవన విధానానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్,వివిధ విభాగాల ఇన్‌స్పెక్టర్లు గోపి,రాజేంద్ర ప్రసాద్, చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాస్,ఆర్‌ఐలు దామోదర్, శేఖర్,రమేష్,సీసీ సందీప్,ఎస్సైలు ఉపేందర్, సంతోష్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *