ప్రాంతీయం

హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.

22 Views

మత దురహంకారం, కులవివక్ష, సామాజిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్‌ లక్ష్యమని ఆ సంఘం సిద్దిపేట జిల్లా కన్వీనర్‌ ముక్కపల్లి రాజు మాదిగ అన్నారు. ఆదివారం రాయపోల్‌ మండల కేంద్రంలోని జీఎల్‌ఆర్‌ గార్డెన్‌ హాల్‌లో మండల ఇన్‌చార్జి అయ్యగళ్ల రవి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ – ఎంఎస్పి నూతన కమిటీల ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదిగల హక్కుల సాధనకు, సామాజిక అసమానతల నిర్మూలనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా అయ్యగళ్ల రవి మాదిగ, అధికార ప్రతినిధిగా కొనింటి లక్ష్మణ్‌ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా గుండారం ఎల్లం మాదిగ, ఉపాధ్యక్షుడిగా మద్దూరి యాదగిరి మాదిగను ఎన్నుకున్నారు.

 

అలాగే ఎంఎస్పి మండల అధ్యక్షుడిగా తుడుం నర్సింగరావు మాదిగ, అధికార ప్రతినిధిగా శ్రీనివాస్‌ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా రాముల నాగరాజు మాదిగ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి ఇస్తారి గల్ల ఎల్లం మాదిగ, మైస రాములు, పుర నరసింహులు మాదిగ, మల్లుగారి యాదగిరి మాదిగ, గజ్వేల్‌ రామచంద్రం, రామ్మోళ స్వామి, సోమని ఇస్తారి, మన్నె గణేష్‌, మసన్‌పల్లి రాజు, ఉషనగల్ల శ్రీనివాస్‌, సంతోష్‌ టెంకంపేట నర్సింలు  తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *