రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు జగ్గోల హేమలత–సురేష్ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన గృహంలోకి అడుగుపెట్టిన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరడంతో పాటు వారి ఆత్మగౌరవం నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాల దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు పాల రామగౌడ్, గ్రామ అధ్యక్షులు స్వామి, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, రాంసాగర్ గ్రామ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.





