తొగుట: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్ రావును తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్ రావుకు కంకణం ధరింపజేసి, జమ్మి ఆకులను బంగారంగా అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండారు స్వామి గౌడ్, సుతారి రాంబాబు, జర్నలిస్ట్ షఫీ తదితరులు పాల్గొన్నారు.





