దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు తిర్మలాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తాజా, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా నీరుడి సులోచనకు రూ.27,000, బండారు సుగుణవ్వకు రూ.18,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిలు, వేణు, రోషన్, రాజు తదితరులు పాల్గొన్నారు.





