ప్రాంతీయం

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలి

2 Views

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలి.

తెలుగు న్యూస్ మంచిర్యాల:

తెలంగాణ రాష్ట్రంలో సూపర్ ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని, ఇది కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  వెల్లడించారు.మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  మంచిర్యాల పట్టణంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మాట్లాడుతూ ఎల్ నినో తీవ్రత వల్ల రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ విపత్తును కరోనా మహమ్మారి తరహాలోనే ప్రజలందరి సహకారంతో సమిష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలందరూ సకరించాలని అన్నారు.

మంచిర్యాల నియోజకవర్గంలో ఎల్ నినో ఇబ్బంది కారణంగా నీటి కొరత ఉండే అవకాశం ఉన్నందున, రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి కాకుండా, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని ఎమ్మెల్యే గారు సూచించారు. శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు.. యాసంగిలో రైతులు నీటి లభ్యతను బట్టి అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు చేస్తోందని తెలిపారు. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు..

మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు..

కీ,, శే,, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు అందించే చీరాలు ఈసారి సంక్రాంతి పండుగకు 10 రోజుల ముందు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులరీత్యా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, సంక్రాంతి కి తమ సేవా కార్యక్రమం కొనసాగిస్తామన్నారు..

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూదరి తిరుపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *