ప్రాంతీయం

రైతులకు 24 గంటల కరెంటు అందించాలి-మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు

3 Views

*రైతులకు 24 గంటల కరెంటు అందించాలి-
మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు *

తెలుగు న్యూస్ మంచిర్యాల:

మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట పట్టణంలో రైతులకు 24 గంటల కరెంటు అందించాలని రైతులతో కలిసి కాగడాలతో ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు  మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.

అనంతరం వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంటు కోతులతో రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని అన్నారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలతో రైతులు మరియు ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. అదేవిధంగా కరెంటు సరిగ్గా లేక మోటార్లు కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి తద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పొలాలకు నీళ్లు పెట్టడానికి రైతులు అర్ధరాత్రి కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అని అన్నారు. రైతుల పంటలు ఎండిపోతున్న పెట్టుబడులు నాశనం అవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీసం సోయలేదు ముందస్తు ప్రణాళిక లేదు సమస్య పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదు అని అన్నారు. రైతులకు సక్రమంగా కరెంటు ఇవ్వలేని ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు అని తెలిపారు. ఈ పరిస్థితి కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువని అన్నారు.  కెసిఆర్  భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైన తెలంగాణకు విద్యుత్ కొరత రాకూడదని లక్ష్యంతో భద్రాద్రి,యాదాద్రి వంటి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని తెలిపారు. కెసిఆర్  నిర్మించిన విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది?థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యం తో పనిచేయడానికి అవసరమైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.  విద్యుత్ కేంద్రాల్లో ఉండి ఉత్పత్తి సామర్థ్యం ఉండి అయిన కరెంటు కోతలు ఎందుకు వస్తున్నాయి అనేదానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిని దెబ్బతీసి తెలంగాణ విద్యుత్ వ్యవస్థను సంక్షోభంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం నడుతున్నారని అన్నారు. సింగరేణి కాపాడుకోవడం అంటే బొగ్గును కాపాడుకోవడం మాత్రమే కాదు తెలంగాణ విద్యుత్ భద్రతను రైతుల పంటలను ప్రజల భవిష్యత్తును కాపాడుకోవడం అని తెలిపారు. ప్రజా పాలన అంటే సింగరేణి దెబ్బతీసి,విద్యుత్ వ్యవస్థను బలహీనపరిచి చివరకు కరెంటు కోతల భారాన్ని రైతుల మీద వేయడమేన అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్  నాయకత్వంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 7000 మెగావాట్ల స్థాయి నుంచి 20000 మెగావాట్లకు పైగా పెంచినట్లు తెలిపారు  బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి 24 గంటల కరెంటు కరెంటు అందించిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతులతో రైతులు అల్లాడుతున్నారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోతున్న రైతులకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన మోటార్లు ట్రాన్స్ఫర్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి,బొగ్గు నిల్వలు,సరఫరా పరిస్థితి పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  సింగరేణిలో టెండర్లు, బొగ్గు ఉత్పత్తి,నిల్వలు, ఆర్థిక లావాదేవీల పై వచ్చిన ఆరోపణల పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతలకు బాధ్యత ఎవరిది? బొగ్గు సరఫరాలో సమస్యలకు బాధ్యత ఎవరిది? సింగరేణి భవిష్యత్తుకు బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని తెలిపారు. విద్యుత్ వ్యవస్థను రాజకీయ ప్రచారంతో కప్పిపుచ్చుకోకుండా రైతులకు 24 గంటల కరెంటు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ఎండాకాలం ఎవరు పంట వేయవద్దు ప్రభుత్వానికి సహకరించాలని కోరడం చాలా సిగ్గుచేటని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యేకి పరిపాలన చేతకాక ప్రజలను పంట వేయొద్దని చెప్తున్నారని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అసెంబ్లీలో మాత్రం మా ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా ఒక చుక్క కూడా బయటకి పోనీయమని పెద్దపెద్ద మాటలు మాట్లాడాలని కానీ అవి మాటలకే పరిమితం అయ్యాయని హెడ్దేవ చేశారు.దివాకర్ రావు  ఏం చేశారు అని మాట్లాడిన సన్నాసులకు ఈ రోజు దివాకర్ రావు  కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు రాష్ట్రానికే దిక్సూచి అయిందని ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పడం కాంగ్రెస్ పార్టీ కి చెంపపెట్టు అని తెలిపారు. తెలపకు గోదారి పెట్టుకొని మంచిర్యాల నియోజకవర్గాన్ని ఎండపెడుతున్నారంటే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అసమర్థ పాలనకి ఇది నిదర్శనమని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గానికి మరియు తెలంగాణ రాష్ట్రా రైతాంగానికి 24 గంటల కరెంటు మరియు నీరు అందించాలని లేదంటే ఎమ్మెల్యేల ,మంత్రుల ముఖ్యమంత్రి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మండల మరియు పట్టణ మరియు దండేపల్లి మండల ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *