*హిట్ అండ్ రన్ కేసులో పరారీలో ఉన్న లారీ డ్రైవర్ అరెస్ట్*
తెలుగు న్యూస్ రామగుండం పోలీస్ కమీషనరేట్:
లారీతో పోలీస్ కానిస్టేబుల్ అంజిబాబును ఢీకొట్టి,ఆయన మృతికి కారణమై ప్రమాదం అనంతరం పరారైన నిందితుడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
*నిందితుడు వివరాలు*
మధు కంధన్ (43 సంవత్సరాలు)
తండ్రి: కంధన్
నివాసం:ఇంటి నంబర్ 14/19-A, తిట్టకాడు, ఎడప్పాడి,సేలం జిల్లా,తమిళనాడు.
*స్వాధీనం చేసుకున్నవి:*
– ప్రమాదానికి కారణమైన లారీ నంబర్ TN-52-AF-6388
– లారీకి సంబంధించిన వాహన పత్రాలు
–
*కేసు వివరాలు:*
తేదీ 11-10-2026న ఉదయం సుమారు 08:30 గంటలకు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ నంబర్ TN-52-AF-6388ను డ్రైవర్ మధు కంధన్ ఇందారం X రోడ్ వద్ద అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ రోడ్డు డివైడర్ దాటుతున్న పోలీస్ కానిస్టేబుల్ అంజిబాబును ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ అంజిబాబు కుడి చేయి తీవ్రంగా గాయపడటంతో పాటు తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి.చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు లారీని ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసులు అదే రోజు ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించి,నిందితుడికి నోటీసులు జారీ చేశారు.పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ,శిక్ష పడుతుందనే భయంతో నిందితుడు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు.
ఈ రోజు మధ్యాహ్నం జైపూర్ బస్ స్టాప్/పవర్ ప్లాంట్ సమీపంలో నిందితుడు తన స్వస్థలమైన తమిళనాడుకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడనే సమాచారం అందడంతో జైపూర్ ఎస్ఐ భూమేష్ మరియు సిబ్బంది సహాయం తో పంచుల సమక్షంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.
ఈ విషయాన్ని జైపూర్ ఏసీపీ ఆర్. వెంకటేశ్వర్లు,సీఐ కె. నవీన్ కుమార్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించి, నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందిని వారు అభినందించారు.





