*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు*
తెలుగు న్యూస్ మంచిర్యాల:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ , మున్సిపల్ కమిషనర్ జి. అన్వేష్ , అసిస్టెంట్ కమిషనర్ రాజ్ కుమార్ హాజరై బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కార్యాలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమలో మున్సిపల్ పాలకవర్గం కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ,సిబ్బంది,మెప్మ సభ్యులు పాల్గొన్నారు.





