*అంకెల గారడీతో సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు*
తెలుగు న్యూస్ మంచిర్యాల:
*సింగరేణి కార్మికులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేవలం 34 శాతం వాటాను ఇవ్వడాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మరియు జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.*
ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటుంది తప్ప సంస్థకు వచ్చిన లాభాలను మాత్రం ప్రకటించకుండా అంకెల గారడీతో కార్మికులను ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. గత సంవత్సరం కార్మికులకు 2.50 లక్షలు ఇస్తే ఈ సంవత్సరం కేవలం 1.50 లక్షల రూపాయలు బోనస్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సింగరేణి కార్మికులు చెమటోడ్చి కష్టపడి బొగ్గు ఉత్పత్తి చేస్తేనే సంస్థకు లాభాలు వస్తున్నాయని కానీ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులను ఇతర ప్రయోజనాలకు వాడుకొని సంస్థకు నష్టం కలిగిస్తున్నది అని అన్నారు. గతంలో పది సంవత్సరాలు BRS ప్రభుత్వం మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను ఒక్క ఏటిఎం లాగా ఆదుకుంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదని అన్నారు. సింగరేణి లాభాల బోనస్ లో తప్పుడు లెక్కలు చూపించి కార్మికుల మోసం చేయడం ప్రారంభించింది BRS పార్టీ అని దాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది అని అన్నారు. కార్మికులకు ఇంత నష్టం జరుగుతున్న మన పార్లమెంట్ లో ఉన్న ముగ్గురు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు మరియు ఎంపీ మాత్రం నోరు మెదపకుండా ఢిల్లీకి పోయి కేంద్ర ఎన్నికల సంఘం మరియు మోడీ గారి ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ కి పోయి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న ఎంపీ మరియు మంత్రి వివేక్ గారు చెన్నూరు అసెంబ్లీ లో SIR వల్ల ఓట్లు తొలగించ బడ్డ పదిమందిని చూపించాలని సవాల్ విసిరారు. SIR ప్రక్రియ లో మరణించిన, డబల్ మరియు షిఫ్టింగ్ ఓట్లు తొలగిస్తున్నారు తప్పితే ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల లెక్కలు బయటపెట్టాలని మరియు కార్మికులకు 35 శాతం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరిఖని సభలో కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం మరియు కిషన్ రెడ్డి గారి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కిషన్ రెడ్డి గారి చొరవ వల్లే ఎన్నో ఏండ్ల నుండి పర్యావరణ అనుమతులు రాక పెండింగ్ లో ఉన్న నైని కోల్ బ్లాక్ కి అన్ని అనుమతులు ఇప్పించి సింగరేణి సంస్థకు అప్పచెప్పారని అన్నారు. అదే విధంగా తాడిచర్ల-2 ప్రాజెక్ట్ మరియు మణుగూరు డీప్ సైడ్ బ్లాక్ కూడా కిషన్ రెడ్డి గారి చొరవ వల్లే సింగరేణి సంస్థ కు దక్కిందని తెలుసుకొని మాట్లాడాలని కేటీఆర్ గారికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారి చొరవతో దేశం అంతటా విస్తరించడానికి కృషి చేస్తుందని తెలిపారు. BRS హయాంలో తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ను AMR అనే ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి సంస్థ ను దోచుకున్న చరిత్ర BRS ప్రతీది అని కేటీఆర్ సింగరేణి సంస్థ గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యకు వేదాలు వల్లించినట్టు ఉంది అని అన్నారు. సింగరేణి కార్మికులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని కార్మికులకు 35 శాతం వాట చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, తుల ఆంజనేయులు, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, కస్తూరి నాగరాజు, పట్టి వెంకట కృష్ణ, కమలాకర్ రావు, ఆకుల అశోక్ వర్ధన్, జయరామ రావు, వైద్య శ్రీధర్, రంగ శ్రీశైలం, కుర్రే చక్రవర్తి, బోయిని దేవేందర్, రామగిరి బనేష్, బూర్ల చిరంజీవి, మహేందర్, తరుణ్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు.





