తెలుగు న్యూస్ *కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా*
*వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్*
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు.
జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ పుష్పగుచ్ఛం అందించి డీఐజీకి ఘన స్వాగతం పలికారు.అనంతరం డీఐజీ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యాలయ ఆవరణను పరిశీలించిన ఆయన, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, పచ్చదనంతో, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB) కార్యాలయాన్ని తనిఖీ చేసి,నేరాల రికార్డులు,కేసుల వివరాలు,నేరస్థుల డేటా,పెండింగ్ కేసులకు సంబంధించిన రికార్డులు,రిజిస్టర్లు, ఫైళ్ల నిర్వహణను పరిశీలించారు.
అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలోని A & B సెక్షన్లు, ఫింగర్ప్రింట్,D4C, కమాండ్ కంట్రోల్ విభాగాలను తనిఖీ చేసి,ఆయా విభాగాల్లో నిర్వహిస్తున్న రికార్డులు,రిజిస్టర్లు, ఫైళ్లు,సిబ్బంది విధుల నిర్వహణ, కార్యాలయ పనితీరును పరిశీలించారు. రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు నవీకరించి భద్రపరచాలని అధికారులకు సూచించారు.
“పోలీస్ శాఖ సమర్థవంతమైన పనితీరుకు ఖచ్చితమైన రికార్డుల నిర్వహణ ఎంతో కీలకం” అని డీఐజీ పేర్కొన్నారు. కేసులు,నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేసి, అవసరమైనప్పుడు తక్షణమే అందుబాటులో ఉండేలా డేటాను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ డేటా నిర్వహణ, రికార్డుల నవీకరణలో నాణ్యత, ఖచ్చితత్వాన్ని పాటించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో పరిశుభ్రత, క్రమశిక్షణ,ఫైళ్లు మరియు రికార్డుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, సిబ్బంది తమకు అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని డీఐజీ సూచించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా కార్యాలయ విభాగాల పనితీరును సమీక్షించి, పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఉచిత పోలీస్ నియామక శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న 160 మంది అభ్యర్థులతో డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్ మాట్లాడి,వారి శిక్షణ,సన్నద్ధతకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకుని,పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్,ఏఎస్పీ (అడ్మిన్) శ్రీ చిత్తరంజన్, ఐపీఎస్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్),డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.





