నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలి
.మంత్రి దృష్టికి బెస్ట్ అవైలబుల్ స్కూలు సమస్యలు తీసుకోవడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మ శ్రీనివాస్,తెలంగాణ జన సమితి పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి,
గజ్వేల్ మే 31, తెలుగు న్యూస్ 24/7
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వాళ్ల కి తగిన న్యాయం చేయాలని గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ గడ్డం వివేక్ కి వినతిపత్రం ఇవ్వడము జరిగింది, ఈ కార్యక్రమంలో తుమ్మ శ్రీనివాస్. చిప్పల యాదగిరి. నీరుడి స్వామి. బండారు దేవేందర్. మాట్లాడుతూ.తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు,కవులు కళాకారులు, మహిళలు పాల్గొని రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో కేసులు ఎదుర్కొన్నవారు, జైలు శిక్ష అనుభవించినవారు, తమ విద్యా, ఉద్యోగ అవకాశాలను కోల్పోయినవారు నేడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ప్రస్తుతం పేదరికంలో జీవిస్తుండగా, ఉద్యమంతో సంబంధం లేని వారు ప్రయోజనాలు పొందారని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు నడిపించిన కార్యకర్తలను గుర్తించి వారికి ప్రత్యేక గుర్తింపు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు కల్పించాలని కోరారు.తెలంగాణ ఉద్యమం కుల, మత, రాజకీయాలకు అతీతంగా సాగిందని, సబ్బండ వర్గాల ప్రజల ఐక్య పోరాట ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని, ఉద్యమంలో అమరులైన త్యాగాలను స్మరించుకుంట, ఆశయాల సాధన కోసం ప్రతి మండల స్థాయిలో ఒక కమిటీ వేయాలి మీకు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ తుమ్మ శ్రీనివాస్. దళిత సంఘాల ఐక్య కార్యచరణ రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి. తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు ( టీజేఎస్ ) నీరుడి స్వామి. హంస ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బండారు దేవేందర్. కొడకండ్ల నరసింహులు. సురేష్. ఉద్యమాకారులు తదితరులు పాల్గొన్నారు.





