ప్రాంతీయం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం

3 Views

*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం*

తెలుగు న్యూస్: రామకృష్ణాపూర్ పట్టణం క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వ వార్డులో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి రాజారమేష్ పాల్గొన్నారు.  పి సత్యనారాయణ లయన్స్ కంటి ఆసుపత్రి బెల్లంపల్లి వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి మంచి స్పందన లభించింది.కంటి పరీక్షలు చేసుకుని ప్రాబ్లం ఉన్నవారికి లోపాల దృష్ట్యా అనుబంధ సంస్థల ద్వారా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుందని సంస్థ యాజమాన్యం తెలియచేశారు.

అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారి సేవలు గొప్పవి అని కొనియాడారు. అలాగే వారి సేవలు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.

నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజారమేష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని వారి సేవలు విస్తృతంగా కొనసాగాలని తెలిపారు. టెస్టులు చేపించుకున్న వారికి లోపాలు ఉంటే లయన్స్ క్లబ్ వారు వారి అనుబంధ సంస్థలతో ఉచిత కంటి వైద్యం చేపించడం హర్షనీయమని పేర్కొన్నారు.లయన్స్ క్లబ్ సంస్థ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ క్యాతనపల్లి మున్సిపాలిటీ లో ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయా వార్డులలో ఈ శిబిరం ఏర్పాటు చేయబడుతుందని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.లయన్స్ క్లబ్ సభ్యులు చైర్ పర్సన్ దంపతులను శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నులుగొండ సత్యం,సెక్రటరీ ఆశన వేణి సత్యనారాయణ,
ట్రెజరర్ పిల్లి సతీష్, ప్రోగ్రాం చైర్మన్ సుదర్శన్ గౌడ్, లక్ష్మీకాంత్మ, మంద వేణుగోపాల్, నక్క శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి వేముల వెంకటేష్, గాజుల రాజేష్, కన్నా మంద వేణుగోపాల్, గోక శ్రీనివాస్ ఆడెపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *