ప్రాంతీయం

32 వ డివిజన్ లో భక్తుల సౌకర్యార్థం నూతన రెస్ట్ హాల్ షెడ్ ప్రారంభం

3 Views

*32 వ డివిజన్ లో భక్తుల సౌకర్యార్థం నూతన రెస్ట్ హాల్ షెడ్ ప్రారంభం:*

తెలుగు న్యూస్ మంచిర్యాల:

*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్‌లో గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన రెస్ట్ హాల్ షెడ్‌ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ సుజాత దంపతులు,కార్పొరేటర్ ఎంబాడి కుమార స్వామి  రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.*

*ఈ సందర్భంగా మేయర్  దర్ని మధుకర్  మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో 32వ డివిజన్‌లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం తన సొంత ఖర్చులతో షెడ్ నిర్మిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.*

దేవాలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, మహిళలు ఎండ, వానలకు ఇబ్బంది పడకుండా విశ్రాంతి తీసుకోవడానికి ఈ రెస్ట్ హాల్ షెడ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టడం తన బాధ్యతగా భావిస్తున్నానని, డివిజన్‌లో ప్రజల అవసరాలను గుర్తించి, అందుబాటులో ఉన్న వనరులతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వీరాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ,స్థానిక నాయకులు, భక్తులు, కాలనీ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొని నూతన షెడ్ నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *