ప్రాంతీయం

ఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్

23 Views

ఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్

మర్కుక్, అక్టోబర్ 13, తెలుగు న్యూస్ 24/7

మర్కుక్ మండలం పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఆలయ దొంగతనాల కేసులను ఛేదించిన మార్కుక్ పోలీసులు. సంవర్ధమైన దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడమైనది.పట్టుబడిన నిందితుల వివరాలు:1. నర్సాగల్ల నాగరాజు (వయస్సు: 31 సంవత్సరాలు, తండ్రి: శంకరయ్య, వృత్తి: కూలి, నివాసం: తునికి ఖల్స, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా).2. మొగుల్ల మల్లేశం (వయస్సు: 38 సంవత్సరాలు, తండ్రి: వీరయ్య, వృత్తి: కూలి, నివాసం: తునికి ఖల్స, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా).అదుపులోకి తీసుకున్న నిందితులను సమగ్రంగా విచారించగా, వారు ఈ క్రింది ఆలయాలలో దొంగతనాలకు,తేది 03-10-2026న పాములపర్తి గ్రామంలోని ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాలలో దొంగతనం, తేది 06-10-2026: గజ్వేల్ పట్టణంలోని సంతోషిమాత ఆలయంలో దొంగతనం, తేది 09-10-2026: పాములపర్తి గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో దొంగతనం చేసినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు సీఐ రవి రాజు తెలిపారు. ఈ విచారణలో నిందితులు గతంలో కూడా పలు ఆలయాలు, ఏటీఎంలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. నిందితుల వద్ద నుండి శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహం, వెండి కిరీటం, రోల్ గోల్డ్ పుస్తెలతాడు,5 లీటర్ ఆయిల్ టిన్, స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనం TS-08GM-7447 మరియు దొంగతనానికి ఉపయోగించిన గడ్డపారను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించి, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన గజ్వేల్ రూరల్ సీఐ రవి రాజు, మర్కుక్ ఎస్.ఐ యూనుస్ అహ్మద్ అలీ,ని సిపి రష్మి పెరుమాళ్, ఐపీఎస్ అభినందించారు. నిందితులను రిమాండ్‌ నిమిత్తం న్యాయస్థానంకు తరలించడమైనది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *