రాయపోల్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన బి.లింగంను శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల్ల రవి ఆధ్వర్యంలో ఎస్‌ఐ బి.లింగంను శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుర్ర నర్సింలు, మాజీ సర్పంచ్ రామోళ్ల స్వామి, జలంధర్, అయ్యగల్ల రవి, జర్నలిస్ట్ ఉషణగల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





