ఇటీవల బదిలీపై రాయపోల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన నూతన ఎస్‌ఐ బి.లింగంను బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రాజాగారి రాజాగౌడ్, నర్సింలు, శివ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బి.లింగంను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. రాయపోల్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మండలంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రాజాగారి రాజాగౌడ్‌తో పాటు నర్సింలు, శివ పాల్గొన్నారు.





