రాయపోల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన బి. లింగంను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇక్బాల్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బి. లింగంకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్‌ఐ కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో బి. లింగం విజయవంతంగా విధులు నిర్వహించాలని మహమ్మద్ ఇక్బాల్ కోరారు.





