తెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా:
ఇటివల కొయ్యూరు గ్రామంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ తో పాటు పాల్గొన్న లకావత్ సవేందర్, లకావత్ లక్ష్మి, దేవి భూమయ్య, కలీం లను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ గురైన నాలుగురికి టెలికం, రైల్వే శాఖల అడ్వైజరీ బోర్డు మెంబర్లు గా కాకా విగ్రహాం ముందు నియామక పత్రాల అందజేశారు. గిరిజన మహిళగా తనకు అవమానం జరిగిన చోటే ఎంపీ వంశీకృష్ణ తన సోదరిగా భావించి చీర, సారే అందించినట్లు గా, నాకు టెలికాం బోర్డు అడ్వైజరి మెంబర్ గా పదవి ఇచ్చి గౌరవించినందుకు కొయ్యూరు నాలుగవ వార్డు సభ్యురాలు లక్ష్మి ఎంపీ వంశీకృష్ణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.నూతనంగా టెలికం రైల్వే శాఖల అడ్వైజరీ బోర్డు మెంబర్లు ఎంపీ వంశీకృష్ణ కు కృతజ్ఞతలు తెలియజేశారు.




