ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాను ‘సురక్షిత్ ప్లస్’ దిశగా తీసుకువెళ్లేందుకు సమన్వయంతో కృషి చేయాలి, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా

8 Views

మంచిర్యాల జిల్లాను ‘సురక్షిత్ ప్లస్’ దిశగా తీసుకువెళ్లేందుకు సమన్వయంతో కృషి చేయాలి, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా.

తెలుగు న్యూస్ మంచిర్యాల:
మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ‘సురక్షిత్’ హోదాను సాధించడం అభినందనీయమని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్మాన్ సమా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ సురక్షిత్ హోదాను సాధించడంలో జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం కృషి అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ‘సురక్షిత్ ప్లస్’ హోదాను సాధించే దిశగా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఐవి/ఎయిడ్స్ నివారణలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయిలో మొబిలైజేషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం జరిగిందని తెలిపారు. వివిధ శాఖలు, ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సమిష్టి కృషితో జిల్లాకు గుర్తింపు లభించిందని తెలిపారు. సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ, హెచ్‌ఐవి/ఎయిడ్స్ నివారణ చర్యలను మరింత విస్తృతం చేయాలని, ప్రజలకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని అధికారులకు సూచించారు. అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశిత లక్ష్యాలను సాధించడం ద్వారా జిల్లాను ‘సురక్షిత్ ప్లస్’ హోదా దిశగా తీసుకువెళ్లాలని తెలిపారు. అనంతరం జిల్లాలో ‘సురక్షిత్’ హోదా సాధించేందుకు విశేష కృషి చేసిన పలువురు సిబ్బందిని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో డిఎంఓ వెంకటేశ్వర్లు, దిశ సి పి ఎం ఎ.నీలిమ, దిశ సిఎస్ఓ రాజేష్, డిఎండిఓ సంతోష్, ఎల్‌డబ్ల్యూఎస్ సూపర్‌వైజర్ శ్రీకాంత్, ఆరోగ్య శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *