
బొప్పాపూర్ లో మురికి కాలువల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డి పేట మండలం బొప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 8,9వార్డులలో 4 లక్షల రూపాయల వ్యయంతో శుక్రవారం మురికి కాలువల నిర్మాణ పనులకు సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి పాలకవర్గ సభ్యులతో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా పాలకవర్గ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా 8 9 వార్డులలో మురికి కాలువ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించామని పనులు మొదలుపెట్టి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి,వార్డ్ సభ్యులు నాగవేణి లత,ఏలూరి రజిత, చెంద్ర రెడ్డి,ప్రసాద్,బొమ్మనవేణి కృష్ణ,వెంకటేష్,ల్యాగల సతీష్ రెడ్డి,ఏలూరి శ్రీనివాస్,లంబ కుమార్,భాను కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.





