ప్రాంతీయం

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్

5 Views

*వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్*

మంచిర్యాల జిల్లా తెలుగు న్యూస్:

*బంగారు, వెండి ఆభరణాలు,నగదు స్వాధీనం,పలు దొంగతనం కేసుల్లో పురోగతి సాధించిన జైపూర్ పోలీసులు*

ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయంలో తాళాలు పగులగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జైపూర్ ఎస్‌ఐ భూమేష్ తెలిపారు.

*నిందితుడి వివరాలు:*

సబ్బాని లక్ష్మీనారాయణ @ చింటూ (27), కాంట్రాక్టర్ బస్తీ, బెల్లంపల్లి.

*వివరాల్లోకి వెళితే..*

నిందితుడు తన స్నేహితుడు మహ్మద్ మగ్దూంతో కలిసి సెప్టెంబర్ 28న ఇందారం గ్రామంలో రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి నగదు, బంగారు,వెండి ఆభరణాలను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. దొంగిలించిన నగదు, ఆభరణాలను ఇద్దరూ పంచుకున్నట్లు నిందితుడు తెలిపాడు.
అదేవిధంగా, బెల్లంపల్లి రైల్వే రాడగంబల బస్తీలో జనవరి 16న, గాంధీనగర్‌లో జూలై 9న,ఇందారం గ్రామంలో సెప్టెంబర్ 24న ఇళ్లకు తాళాలు పగులగొట్టి నగదు,వెండి వస్తువులు, ల్యాప్‌టాప్,సెల్‌ఫోన్ తదితర వస్తువులను దొంగిలించినట్లు విచారణలో వెల్లడించాడు.
నిందితుడి వద్ద నుంచి సుమారు 2 తులాల వెండి కాళ్ల పట్టీలు, రూ.3,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులకు సంబంధించి నిందితుడి సహచరుడిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసి,అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు,వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులు, నగదును ఇంట్లో ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌ఐ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించినప్పుడు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *