ప్రాంతీయం

కంటికి రెప్పలా ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాం

17 Views

సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 5, తెలుగు న్యూస్ 24/7

కంటికి రెప్పలా ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాo– సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్,నిన్న కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ సందర్శించి, ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. అనంతరం ఘటనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్హెచ్ఓ ను ఆదేశించారు.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే, అత్యధిక ప్రమాదాలు వాహనదారుల అజాగ్రత్త, త్రిపుల్ రైడింగ్ హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరుగుతున్నాయని సీపీ రష్మి పెరుమాళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాలకు కోలుకోలేని విషాదాన్ని మిగులుస్తోందని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని కోరుతూ సీపీ ఈ క్రింది సూచనలు చేశారు:1. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా నాణ్యమైన హెల్మెట్ తప్పక ధరించాలి. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం వల్లే తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు పోతున్నాయని స్పష్టం చేశారు.2. బైక్‌పై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడం చట్టరీత్యా నేరం. త్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల వాహన నియంత్రణ కోల్పోయి తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ త్రిపుల్ రైడింగ్ చేయకూడదని విజ్ఞప్తి చేశారు.3. వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడటం, అతి వేగంగా వెళ్లడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం వంటి నిర్లక్ష్యపు పనులు ప్రాణాలకే ముప్పు తెస్తాయి. ప్రయాణంలో పూర్తి దృష్టి డ్రైవింగ్‌పైనే ఉంచాలని సూచించారు.4. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే చట్టప్రకారం భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది. మద్యం మత్తులో వాహనాలు నడిపి సొంత ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని హెచ్చరించారు.5. రహదారులు, జాతీయ రహదారులపై ఎటువంటి హెచ్చరిక సంకేతాలు లేదా హజార్డ్ లైట్లు లేకుండా వాహనాలను నిర్లక్ష్యంగా పార్కింగ్ చేయడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని, అటువంటి వాహనాలపై భారీగా జరిమానాలు విధిస్తామని తెలిపారు.6. జాతీయ రహదారులు మరియు ప్రధాన రహదారులను దాటేటప్పుడు పాదచారులు తీవ్ర జాగ్రత్త వహించాలి. నిర్దేశిత ప్రదేశాల్లోనే రోడ్డు దాటాలని, ఇరువైపులా చూసుకుని జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.7. వాహనాలను వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. వాహనదారులు వేగ పరిమితులను ఖచ్చితంగా పాటిస్తూ, తోటి వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ప్రయాణించాలని సీపీ రష్మి పెరుమాళ్, సూచించారు.త్వరగా వెళ్లడం కంటే సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే ముఖ్యమని, ట్రాఫిక్ నిబంధనల పాటింపును రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని సిద్ధిపేట సీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, సురక్షిత ప్రయాణం కోసం పోలీసు శాఖకు సహకరించాలని ప్రజలను కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *