Breaking News ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రద్దు ఎన్నికలపై అడక్ కమిటీ ఏర్పాటు

80 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం  అక్టోబర్ 05: ఎల్లారెడ్డిపేట మండలంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మండల సంఘం సర్వసభ్య సమావేశం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ లో సోమవారం రోజు జరుపుకొని మండల సంఘానికి ఎలక్షన్లు జరిగి ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఎల్లారెడ్డిపేట విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు గోపాల చారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు చెలిమెల ఆంజనేయులు చారి ప్రకటించడం జరిగింది అంతేకాకుండా వచ్చే నెల నవంబర్ 5వ తారీఖున మండలంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఎలక్షన్లు జరుగుతాయని దీనికిగాను నామినేషన్ ప్రక్రియ తేదీ ప్రకటిస్తామని దీనికోసం ప్రత్యేకంగా ఒక అడక్ కమిటీని ఏర్పాటు చేశామని దానికి మండల కన్వీనర్ గా వంగాల వసంత్ చారిని కో కన్వీనర్లుగా కాంభోజ దేవరాజు చారి మొగులోజు కిష్టయ్య చారి నల్ల నాగుల రామాచార్యులను నియమించామని మండలంలోని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలకు ఈ ఎన్నికలపై ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ నలుగురిని సంప్రదించాలని ఎవరైనా ఆసక్తితో ముందుకు వచ్చి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మరియు కోశాధికారుల కు పోటీ చేయదలుచుకున్న వారికి సదా అవకాశము కల్పిస్తామని సభాముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియు మండల అధ్యక్ష కార్యదర్శులు మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మల ఐక్య సంఘం సభ్యులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *