ప్రాంతీయం

గాంధీ మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి. – కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జాల దుర్గాప్రసాద్, ఏఎంసీ చైర్మన్‌ గొల్లపల్లి కనకయ్య.

102 Views

గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జాల దుర్గాప్రసాద్, ఏఎంసీ చైర్మన్‌ గొల్లపల్లి కనకయ్య అన్నారు. శుక్రవారం రాయపోల్‌ మండల కేంద్రంతోపాటు తిమ్మక్‌పల్లి గ్రామంలో గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిమ్మక్‌పల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా తొడంగి ప్రశాంత్‌ను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అహింసా మార్గంలో గాంధీజీ సాగించిన స్వాతంత్ర్య ఉద్యమాన్ని స్మరించుకున్నారు. స్వచ్ఛత, సామాజిక సమానత్వం, గ్రామ స్వరాజ్యం కోసం ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. నూతన కమిటీ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దుర్గాప్రసాద్‌ సూచించారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ అశోక్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పాల రామాగౌడ్, ప్రధాన కార్యదర్శి గోపాల్, కార్యదర్శి ఉప్పరి రాజు, కోఆర్డినేటర్‌ గుంటి నర్సింలు, ఏఎంసీ డైరెక్టర్లు బాకీ మల్లేశం, ఇప్ప మల్లేశం, ఆత్మ కమిటీ డైరెక్టర్‌ జానీగౌడ్, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దయాకర్, ప్రధాన కార్యదర్శి పాపని నరేష్, కార్యదర్శి ఇంద్రకరణ్‌తోపాటు వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *