రాయపోల్ మండల కేంద్రానికి చెందిన ఒకటో వార్డు సభ్యుడు, రజక సంఘం రాష్ట్ర నాయకుడు గౌరీగారి పర్షరాములు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఆర్వీఎం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పర్షరాములకు ధైర్యం చెబుతూ అధైర్యపడవద్దని, తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, యువజన విభాగం రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి, గల్వ దయాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు





