మంచిర్యాల జిల్లా.
బీసీ ఉద్యమంలో మహిళలు భాగస్వామ్యం కావాలి.
సావిత్రిబాయి పూలే అభినందన సభలో బీసీ నాయకులు పిలుపు.
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా శ్రీహర్ష డిగ్రీ కాలేజీలో 2025 సంవత్సరానికి గాను సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీతలైన అలేఖ్య, ఆడెపు శ్యామల ను ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా నాయకులైన వడ్డేపల్లి మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీ ఉద్యమంలో మహిళల పాత్ర ఉండాలని, చట్టసభలలో మహిళల రిజర్వేషన్ కూడా సాధించాలని, సమాజంలో సగభాగమైన స్త్రీలను కూడా సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో ఎదగనియ్యవాలని, కేంద్ర ప్రభుత్వము తీసుకోవస్తున్న చట్టసభల్లో మహిళ బిల్లులో కూడా బీసీ మహిళల శాతం ఎంతో తేల్చాల్సిన అవసరం ఉన్నదని కూడా, దేశవ్యాప్త కుల జనగణలో, బీసీలకు అన్యాయం చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని, బీసీలలో ఆత్మగౌరవం కాపాడడం కోసం చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ చేయాలని బీసీ రాజ్యాధికారం కోసం జరుగుతున్న ఉద్యమంలో మహిళలు కూడా కలిసి రావాలని, న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న , సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల పైన పోరాటం చేస్తు, ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల పైన పోరాటం చేసిన అడ్వకేట్ అలేఖ్య కి మీ అవార్డు రావడం చాలా సంతోషదాయకమని, రాజకీయరంగంలో , మరియు తన వృత్తి ధర్మమైన నర్సువృత్తులో కూడా సమాజంలో, మంచి ప్రతిభ కనబరిచిన 2014 నుండి బీసీ ఉద్యమంలో పని చేసిన శ్రీమతి ఆడపు శ్యామల కి ఈ అవార్డు రావడం సంతోషదాయకం అని అన్నారు. ఈ స్ఫూర్తితోనే సమాజంలో మహిళలు ఎదిగి బీసీ ఉద్యమంలో కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు డాక్టర్ రఘునందన్, సీనియర్ అడ్వకేట్ బీసీ సీనియర్ నాయకులు కర్రే లచ్చన్న, మాజీ మాజీ మార్కెటింగ్ చైర్మన్, పల్లె భూమేష్, గౌడ సంఘం నాయకులు, రాజేశ్వరం గౌడ్, బీసీ జేఏసీ నాయకులు గుమ్ముల శ్రీనివాసు, గజ్జెల్లి వెంకటయ్య, వివిధ రంగంలో ఉన్న బీసీ నాయకులు అడ్వకేట్ నటేశ్వర్ గోపతి లక్ష్మణ్, వేముల మల్లేష్, లతీఫ్, పెద్దల చంద్రకాంత్, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ఇందల్ రాథోడ్, ఓయూ జేఏసీ నాయకులు చర్ల వంశీ, రాళ్ల బండి రాజన్న, రామగిరి రాజన్న చారి, మెండ మల్లేష్ యాదవ్, బండి రాజలింగు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
