ఇటీవల బదిలీపై రాయపోల్ మండలానికి వచ్చిన ఎంపీడీవో నరేందర్‌ను వడ్డేపల్లి గ్రామ ఉపసర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు కరుణాకర్, నాగరాజు, తప్పటి గుట్ట తదితరులు కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నరేందర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.





