Breaking News

కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు. వీరారెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

13 Views

రాయపోల్‌ మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జాల దుర్గాప్రసాద్‌ ముదిరాజ్ ఆధ్వర్యంలో వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం వీరారెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా గిరిపల్లి మహిపాల్‌, ఉపాధ్యక్షులుగా వేముల నర్సింలు, సత్తయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా శ్యమంతుల సాయికుమార్‌, ప్రధాన కార్యదర్శులుగా రాగి మల్లేశం, వేముల నాగరాజు, కార్యదర్శిగా గొల్ల రాజును ఎన్నుకున్నారు. మహిళా కార్యదర్శులుగా నర్సవ్వ, బచ్చొల్ల లక్ష్మి, యూత్‌ అధ్యక్షుడిగా వగ్గు చందు, ఉపాధ్యక్షుడిగా ప్రభాకర్‌, మహిళా సభ్యులుగా కవిత, సలహాదారుగా పిట్ల మల్లేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *