రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 27: సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ గా భరత్ కుమార్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే క్రమంలో ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను డీఎం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రద్దీ ఉన్న మార్గాల్లో బస్సు సౌకర్యాలు మెరుగుపరచాలని, ప్రయాణ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని రవి గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మట్టే శ్రీనివాస్, ఆరెల్లి వినయ్ కుమార్, చెట్టిపెల్లి హరీశ్, ఎం.డి. అజ్జు, నవీన్ పాల్గొన్నారు.




