ప్రాంతీయం

సింగరేణి బకాయిలు వెంటనే చెల్లించాలి-మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి

5 Views

సింగరేణి బకాయిలు వెంటనే చెల్లించాలి-మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి.

తెలుగు న్యూస్, బెల్లంపల్లి సెప్టెంబర్ 27: సింగరేణి బకాయిలను వెంటనే చెల్లించాలని అలాగే కార్మికుల ఆరు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి అన్నారు. బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి ఆమె పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే చెల్లించాలని, కార్మికుల సమస్యలపై ఈ నెల 30న సీసీసీ కార్నల్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమనికి రాష్ట్ర అధ్యక్షులు, రాంచందర్ రావు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరవుతున్నరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.55 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని రఘునాథ్ రావు కోరారు. ఈ నిధులు సింగరేణి ఆర్థిక బలోపేతంతో పాటు సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి కీలకమని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం ఆరు ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, అందులో 40 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపుగా లాభాల్లో న్యాయమైన వాటా అందించాలన్నారు. కార్మికులకు మెడికల్ బోర్డు విషయంలో జాప్యం లేకుండా ప్రతి నెల మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అక్రమాలు, అన్యాయాలకు తావులేకుండా పారదర్శకంగా అర్హులైన కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కార్మికుల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు రెండు గుంటల స్థలం కేటాయించి, ఇల్లు నిర్మించుకునేందుకు బ్యాంకు రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అవసరమైన పనిముట్లు, హెల్మెట్లు, సేఫ్టీ షూస్, ఇతర భద్రతా పరికరాలను నాణ్యతతో సకాలంలో అందించాలని అన్నారు. డిస్మిస్ అయిన కార్మికుల కేసులను మానవతా దృక్పథంతో, నిబంధనలకు అనుగుణంగా పునఃపరిశీలించి, అర్హత ఉన్న కార్మికులకు మరో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
“కార్మికుల శ్రమకు గౌరవం – హక్కులకు రక్షణ – కుటుంబాలకు భద్రత” అనే లక్ష్యంతో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి బీజేపీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సీనియర్ నాయకులు మద్దెర్ల శీనివాస్, దూది ప్రకాష్, జిల్లా నాయకురాలు నల్లుల సంగీత, పట్టణ ఉపాధ్యక్షులు గాండ్ల మహేష్, పుల్లూరి రాము, పట్టణ కార్యదర్శులు గంధం అనిల్, అల్లకటి మహేష్, యువ మోర్చా అధ్యక్షులు తోటపల్లి ఓం సాయి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఇప్ప స్వామి, మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ గౌస్ బాబా, ఎస్టి మోర్చా అధ్యక్షులు బానోతు సంతోష్, పుల్ల ప్రశాంత్ కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *