ప్రాంతీయం

దుంపలపల్లి పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన. సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి.

18 Views

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని దుంపలపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న బోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు అన్నం, గుడ్డు, పాలకూర పప్పు, సాంబారును ఆమె పరిశీలించారు. కూర నాణ్యత మెరుగుపరచాలని విద్యార్థులకు రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు కొలత ప్రకారం వంట చేసేలా మానిటర్ చెయ్యాలని టీచర్లను ఆదేశించారు. విద్యార్థులకు కడుపు నిండా తినేలా సరిపడినంత అన్నం కూరలు పెట్టాలని మీ ఇష్టానుసారం పెడితే సహించేది లేదని వంట సిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థులకు మరల అన్నం, కూరలను వారు కూర్చున్న వద్దకు వెళ్లి వడ్డించాలి వంట సిబ్బందిని ఆదేశించారు. భోజనం చేస్తున్నపుడు విద్యార్థులు లేవకూడదని తెలిపారు. విద్యార్థుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. భోజనం ఎలా ఉంది రోజు ఎలా పెడుతున్నారని అడగ్గా బాగానే ఉందని విద్యార్థులు కలెక్టర్ కి తెలిపారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఒక్క మెతుకు కింద పడకుండా శుభ్రంగా నెమ్మదిగా తినాలని విద్యార్థులకు సూచించారు. డైనింగ్ హాల్, పాఠశాల పరిసరాలు చెత్త లేకుండా శుభ్రంగా ఉంచాలని స్కావెంజర్ ను ఆదేశించారు. విద్యార్థులకు భోజనం చదువు విషయంలో రాజీ పడవద్దని ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. అంతకుముందు ప్రాంగణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న బోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆహార పదార్థాలను తనికి చేసి మంచి ఆహారం అందించాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారని బాగా తిని ఆడుకోవాలని సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *