తెలుగు న్యూస్ మంచిర్యాల:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షాదీఖానా మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలోని ముస్లిం మహిళలకు 375 కుట్టు మిషన్లను అధికారులతో కలిసి పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.
ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడేలా నిలుస్తుందని తెలిపారు. అనంతరం సురేఖ ని శాలువాతో సన్మానించిన మైనారిటీ జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఖలీద్, ముస్లిం మహిళలు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూదరి తిరుపతి, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు , మైనారిటీ నాయకులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





