*క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలి: మేయర్ దర్ని మధుకర్ *
మంచిర్యాల, తెలుగు న్యూస్:
మంచిర్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జోనల్ లెవెల్ సెలెక్షన్స్ మరియు టోర్నమెంట్ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని, క్రీడా పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లుకర్రే శ్రీనివాస్, తాళ్ళ సంపత్ రెడ్డి , పత్తి వెంకటేష్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు అట్కపురం సతీష్,అంగడి రాజేష్, భీమిని రాజేష్ ,స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్‌లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.





