హజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో PACS నూతన బాధ్యతల స్వీకారం.
మంచిర్యాల, తెలుగు న్యూస్:
కర్ణమామిడి గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన కర్ణమామిడి PACS చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన PACS చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లకు ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి, శాలువాలుతో సన్మానించారు..
రైతుల సంక్షేమం, సహకార రంగం బలోపేతం మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి PACSలు కీలకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను గుర్తించి, సహకార స్ఫూర్తితో ముందుకు సాగాలని నూతన పాలకవర్గానికి సూచించారు..
అనంతరం గ్రామ నాయకులు, ప్రజలు కమ్యూనిటీ హాల్ మౌలిక వసతుల కోసం డబ్బులు మంజూరు చేయాలని చెప్పగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు వెంటనే స్పందించి మంజూరు చేస్తానని చెప్పారు..
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక సర్పంచ్ బొడ్డు భూమయ్య, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, పడ్తనపల్లి PACS చైర్మన్, హజీపూర్ మండల అధ్యక్షులు తోట రవి, మంచిర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా OBC చైర్మన్ వొడ్డే రాజమౌళి, కార్పొరేటర్లు, సర్పంచ్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో వైస్ చైర్మన్, డైరెక్టర్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





