ప్రాంతీయం

గణపతి నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.

6 Views

గణపతి నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.

మంచిర్యాల , తెలుగు న్యూస్:

మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మరియు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నిమజ్జన శోభాయాత్ర ఉత్సవాల్లో మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జెండా ఊపి గణపతి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొని, నేడు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు.నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ, నియమ నిష్ఠలతో, పరస్పర సహకారంతో ప్రశాంతంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు.

ఈసారి గోదావరిఖని సమీపంలోని గోదావరిలో కాకుండా గూడెం గోదావరిలో గణపతి విగ్రహాల నిమజ్జనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గూడెం వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో DCP భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూద తిరుపతి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుండ సుధాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *