ప్రాంతీయం

వినాయక నిమర్జన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

11 Views

వినాయక నిమర్జన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,తెలుగు న్యూస్ సెప్టెంబర్ 25, 2026:
వినాయక నిమర్జన కార్యక్రమాన్ని పకడ్బందీగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాన్ని జైపూర్ ఎ.సి.పి. వెంకటేశ్వర్లు తో కలిసి సందర్శించి నిమర్జన కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నిమర్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమం పూర్తి అయ్యే వరకు పోలీసు శాఖ అధికారులు బందోబస్తు కొనసాగించాలని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియ పర్యవేక్షించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *