ప్రాంతీయం

ప్రజాసేవలో ఉంటు మారథాన్ ఈవెంట్లలో పాల్గొన్న బండ అనిల్ కానిస్టేబుల్,బండ అనిల్ కు అభినందనలు తెలిపిన,రాజన్న సిరిసిల్ల ఎస్పీ బి.మహేష్ గితే 

39 Views

ప్రజాసేవలో ఉంటు మారథాన్ ఈవెంట్లలో పాల్గొన్న బండ అనిల్ కానిస్టేబుల్,బండ అనిల్ కు అభినందనలు తెలిపిన,రాజన్న సిరిసిల్ల ఎస్పీ బి.మహేష్ గితే 

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7

రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలంలోని కొత్త పేట గ్రామానికి చెందిన బండ అనిల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బండ అనిల్ కానిస్టేబుల్ వివిధ రాష్టాలలో నిర్వహిస్తున్న మారథాన్ ఈ వెంట్లలో పాల్గొని ఎంతో మంది యువ సిబ్బందికి ఆదర్శంగా నిలిచిన బండ అనిల్ ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ బి మహేష్ గీతే ( ఐపీఎస్ ) అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ గితే మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇటువంటి పోటీలలో ప్రావీణ్యం సంపాదించి,రాష్ట్ర, దేశ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బండ అనిల్ కానిస్టేబుల్ మాట్లాడుతూ యొక్క మారథాన్ లో పాల్గొనడానికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని వయసుతో సంబంధం లేకుండా,జాయిన్ రన్నింగ్ వంటివి చేయాలని ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి శారీరకంగా మానసికంగా ఇంకా మేలు జరుగుతుందని, ముఖ్యంగా యూత్ డ్రగ్స్ కి దూరంగా ఉండాలని తెలిపారు.అనంతరం ఇటీవల ముంబాయిలో జరిగిన మారథాన్ పోటిల్లో పాల్గొని 42.2 కిలోమీటర్లు 3 గంటల 26 నిముషాలలో,రాజస్థాన్ రాష్టంలో జరిగిన ఇండియా బాడర్ లో అత్యంత చలిలో 100కిలోమీటర్లు 14 గంటలలో చేరుకున్నారు. అలాగే కోల్ కత్తా రాష్ట్రంలో జరిగిన మారథాన్ లో పాల్గొని 25 కిలోమీటర్లు 1గంట 56 నిమిషాలలో చేరుకున్నారు.ఢిల్లి లో జరిగిన మారథాన్ లో పాల్గొని 21 కిలోమీటర్లు 1 గంట ముప్పై ఎనిమిది నిముషాలలో చేరుకున్నానని తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *