ప్రాంతీయం

మానవత్వానికి మరోసారి అండగా నిలిచిన న్యాయవాది నటేశ్వర్

10 Views

మానవత్వానికి మరోసారి అండగా నిలిచిన న్యాయవాది నటేశ్వర్.

మంచిర్యాల తెలుగు న్యూస్ : మంచిర్యాల పట్టణంలోని సురేశ్ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తాండూర్ మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన 80 ఏళ్ల మొండయ్య కి అత్యవసర పరిస్థితుల్లో రక్తకణాలు అవసరమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల నివాసి న్యాయవాది నటేశ్వర్  వెంటనే స్పందించి జననీ బ్లడ్ బ్యాంక్‌కు చేరుకుని రక్తకణాలు దానం చేశారు. నటేశ్వర్  రక్తదాన సేవలో ఎప్పటికప్పుడు ముందుంటూ, ఇప్పటివరకు సుమారుగా 30 సార్లు రక్తకణాలు దానం చేయడంతో పాటు, 50 సార్లు రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం, రక్తకణాలు అవసరమైన వారికి తన వంతు సహాయం అందిస్తూ ఆయన చేస్తున్న సేవలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

ఈ సందర్భంగా రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ మాట్లాడుతూ, “అత్యవసర సమయంలో రక్తకణాలు దానం చేసి మొండయ్య కి అండగా నిలిచిన నటేశ్వర్ కి ప్రత్యేక అభినందనలు. రక్తదానం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుంది. యువతతో పాటు ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తదానానికి ముందుకు రావాలి” అని అన్నారు.

జననీ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా నటేశ్వర్ గారి సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన సమయంలో రక్తకణాలు దానం చేయడం ద్వారా ఎంతోమందికి సహాయం అందించవచ్చని పేర్కొన్నారు.

“రక్తదానం – ప్రాణదానం… రక్తకణాల దానం – మరో జీవితానికి భరోసా” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ మానవతా సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *