పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.
మంచిర్యాల, తెలుగు న్యూస్:
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో ఈరోజు మంచిర్యాల పట్టణం వైశ్య భవన్ లో మెగా వైద్య శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ప్రారంభించడం జరిగింది. ప్రతిమ ఆసుపత్రి మరియు మంచిర్యాలలోని ప్రముఖ వివిధ వైద్య నిపుణులు వచ్చి చికిత్స కోసం వచ్చిన 2000 మందికి పైగా వారికి వైద్య సేవలు అందించి మందులు అందించడం జరిగింది. అందులో అవసరం అయిన వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు లో 2D ఎకో, చెస్ట్ ఎక్స్ రే, మామోగ్రామ్ (రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష), ECG, షుగర్ వంటి పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో వైద్య శిబిరాలు ఏర్పాటు ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని రఘునాథ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, గాజుల ముఖేష్ గౌడ్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎనగందులు కృష్ణ మూర్తి, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, పట్టి వెంకట కృష్ణ, జోగుల శ్రీదేవి, మోటపలుకుల తిరుపతి, బియ్యాల సతీష్ రావు, అమిరిశెట్టి రాజ్ కుమార్, రంగ శ్రీశైలం, కుర్రె చక్రవర్తి, గడ్డం స్వామి రెడ్డి, రమణ రావు, ప్రేమ్ సింగ్, పచ్చ స్వప్న రాణి, గోపతి రాజయ్య, కర్రె లచ్చన్న మరియు తదితరులు పాల్గొన్నారు.





